Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:35 PM

సూర్యాపేట 28వ వార్డులో సంక్రాంతి సంబరాలు

16-01-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పతంగులు ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానిక ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని 28వ వార్డులో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పతంగులు ఎగురవేసి సంబరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే మహత్తర పండుగ అని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో ఇలాంటి సంబరాలు జరగడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పతంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. సంక్రాంతి పాటలు, ఆటపాటలతో వార్డు మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

Sthanikam

సూర్యాపేట 28వ వార్డులో సంక్రాంతి సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News