Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:32 AM

సూరంపాలెం లో పోలీస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించిన సీఐ కె.రామకృష్ణ, ఎస్సై డి రామకృష్ణ

11-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 11 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి నూజివీడు డిఎస్పి కె వి వి ఎన్ వి ప్రసాద్ యొక్క ఆదేశాల పై నూజివీడు రూరల్ సిఐ కె రామకృష్ణ ఆధ్వర్యములో చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామ పరిధిలో విస్తృతమైన విజిబుల్ పోలీసింగ్, హెల్మెట్, సైబర్ నేరాలకు డయల్ 112 పై అవగాహనను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణా పాయం నుండి రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు.అలాగే, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని హితవు పలికారు. "వేగం వద్దు ప్రాణం ముద్దు" అనే నినాదాన్ని గుర్తుంచు కోవాలని ఆయన కోరారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని ఆయన అన్నారు.విజిబుల్ పోలీసింగ్ సందర్భంగా ప్రజలకు సైబర్ క్రైమ్ పై జాగ్రత్తలను సైబర్ నేరగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా మీ యొక్క డబ్బులు కాపాడుకోవాలని ఎవ్వరైనా సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 కు సమాచారం అందించాలని సమాచారం అందించిన ఎడల వారు సహాయ సహకారాలు అందిస్తారని, అత్యవసర సమయాలలో ప్రజలు డయల్ 112 కు సమాచారం అందించి పోలీసు వారి యొక్క సహాయాన్ని పొందవచ్చునని విషయాలపై అవగాహనను కల్పించినారు మైనర్ల కు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలను వారికి వివరించి ఎవ్వరైనా మైనర్ లకు ద్విచక్ర వాహనం ఇస్తే వారి రక్త బంధువులపై కూడా చర్యలు తీసుకుంటామని,ఈ విజిబుల్ పోలీసింగ్ మరియు అవగాహన కార్యక్రమం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి మరియు నేరాలను నివారించడానికి దోహదం చేస్తుందని ఇన్స్పెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనాలు నడిపే సమయాలలో మీ కుటుంబ సభ్యులు మీపై ఆధారపడి ఉన్నారని విషయాన్ని గుర్తుంచుకోవాలని సురక్షితమైనటు వంటి ప్రయాణాన్ని చేసి సురక్షితముగా గమ్యస్థానాలకు చేరాలని ఇన్స్పెక్టర్ వాహనదారులకు తెలియజేశారు.

Sthanikam

సూరంపాలెం లో పోలీస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించిన సీఐ కె.రామకృష్ణ, ఎస్సై డి రామకృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News