Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:23 PM

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల వేడి.. కమలం జెండా ఎగరవేయాలని పిలుపు

05-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం మరింత ఉధృతమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా, ఆ ప్రసంగాన్ని సూర్యాపేట పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు వీక్షించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 15వ వార్డు బిజెపి అభ్యర్థి తాడూరి జ్యోతి తన వార్డు మహిళలతో కలిసి సభ ప్రసంగాన్ని ఆలకించి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై మహిళల్లో విస్తృత ఆదరణ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంకినేని వెంకటేశ్వరరావు, జాతీయ అధ్యక్షుల పిలుపుతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని, సూర్యాపేట మున్సిపాలిటీలో కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల వేడి.. కమలం జెండా ఎగరవేయాలని పిలుపు

Article Image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం మరింత ఉధృతమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా, ఆ ప్రసంగాన్ని సూర్యాపేట పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు వీక్షించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 15వ వార్డు బిజెపి అభ్యర్థి తాడూరి జ్యోతి తన వార్డు మహిళలతో కలిసి సభ ప్రసంగాన్ని ఆలకించి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై మహిళల్లో విస్తృత ఆదరణ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంకినేని వెంకటేశ్వరరావు, జాతీయ అధ్యక్షుల పిలుపుతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని, సూర్యాపేట మున్సిపాలిటీలో కమలం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News