Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:33 AM

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

వేడుకల్లో పాల్గొన్న కొప్పుల వైణరెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వైణరెడ్డి, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలకు ముందు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే రోజున భారత్ ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిందని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం కేవలం హక్కుల పండుగ మాత్రమే కాదని, బాధ్యతల పండుగ కూడా అని అన్నారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకోవడం, చట్టాలను గౌరవించడం, ఐక్యతగా ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. భారత్ విభిన్న సంస్కృతులకు నెలవని, ఈ భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి ఎండి. ఫసియోద్దీన్, మార్కెట్ డైరెక్టర్లు, కమిషన్ దారులు, ఖరీదారులు, పుర ప్రముఖులు, రైతులు, గుమస్తాలు, హమాలీలు, దడువాయులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News