Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:56 AM

సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం

సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం

సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం
08-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీజేపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా సామాన్య మహిళ వీరవెల్లి ఉమ ప్రకటన

సూర్యాపేట పట్టణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయంతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అధికారమే లక్ష్యంగా కాకుండా సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తూ, బీజేపీ మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా 40వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సామాన్య మహిళ వీరవెల్లి ఉమను ప్రకటించారు.

వీరవెల్లి ఉమ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నిరుపేద మహిళ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఆమె సేవాభావాన్ని గుర్తించిన బీజేపీ, ఆమెకు అత్యున్నత బాధ్యత అప్పగిస్తూ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ నిర్ణయం పట్టణ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.ఈ సందర్భంగా 40వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, డబ్బు సంచులతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని స్పష్టం చేశారు. పేదరికం నుంచి వచ్చిన ఒక మహిళను మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠంపై కూర్చోబెట్టడమే బీజేపీ లక్ష్యమని, తద్వారా అభివృద్ధిని సామాన్యుడి ముంగిటకు తీసుకెళ్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పదవికి అవసరమైన మెజారిటీ స్థానాలను బీజేపీ సొంతంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో 40వ వార్డు ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీని శాసించే అవకాశం తమ వార్డుకు, అది కూడా పేదింటి మహిళకు దక్కిందని గుర్తుచేశారు. డబ్బు, ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ ఆడబిడ్డ వీరవెల్లి ఉమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఆమెను ఎన్నుకొని అభివృద్ధిలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.

Sthanikam

సూర్యాపేట రాజకీయాల్లో పెను సంచలనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News