Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:48 AM

సూర్యాపేట మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా

07-02-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కాంగ్రెస్‌కు జైకొడుతున్న వార్డు ప్రజానీకం

44వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ధీమా

సూర్యాపేట మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుణగంటి హేమా సతీష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.శనివారం వార్డు ప్రచారంలో భాగంగా గాంధీ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ, గుణగంటి హేమా సతీష్ కౌన్సిలర్‌గా గెలిచిన వెంటనే వార్డులోని సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారని, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందేలా కృషి చేస్తారని తెలిపారు.ఇప్పటికే వార్డు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ప్రచారంలో ప్రజలు అభ్యర్థిని తమ సొంత బిడ్డలా ఆదరించి ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, ఆడబిడ్డలు బలంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు.త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, సూర్యాపేట మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. మున్సిపల్ పీఠాన్ని తమ ప్రియతమ నాయకుడు స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి అంకితం చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, గుణగంటి వంశీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుణగంటి రాములు, మన్సూర్, గుణగంటి సతీష్, మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News