Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:26 AM

సూర్యాపేట 19వ వార్డు నుంచి బీజేపీలో చేరికలు

21-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

30 మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి: సూర్యాపేట పట్టణంలోని 19వ వార్డు నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన 30 మంది భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరికలు బుధవారం బీజేపీ జిల్లా నాయకులు ఆకారపు పరిపూర్ణాచారి – ఉషారాణి ఆధ్వర్యంలో జరిగాయి. వార్డుకు చెందిన పిడమర్తి కీర్తి, లవన్ తదితరులకు బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సూర్యాపేట మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుని చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. చైతన్యవంతమైన, విద్యావంతులైన పట్టణ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని తెలిపారు.

బీజేపీలో చేరిన వారిలో నిమ్మల కావ్య, నిమ్మల పురుషోత్తం, తీపి రెడ్డి శంకర్, యానాల శివ, జలగం లింగరాజు, తోట శ్రవణ్, కుంచం సంపత్, బొడ్డు అంజి, కొండూరి శివ, కలిగిరి సందీప్, సుంకరబోయిన కోటి, నడిపల్లి పృథ్వి, గొర్రె కృష్ణ, నిమ్మల శ్రీకాంత్, షేక్ మోసిన్, నారబోయిన శ్రీకాంత్, షేక్ రహీమ్ కాంత్, సోము లింగయ్య, షేక్ జావిద్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, మండల అధ్యక్షులు సంధ్యాల సైదులు, జిల్లా నాయకులు బండపల్లి శ్రీనివాస్, గన్నోజు భరత్, వాంకుడోత్ శ్రీనివాస్ నాయక్, వార్డు నాయకులు పూసపల్లి కృష్ణ, మామిడి వెంకన్న, కన్నా సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట 19వ వార్డు నుంచి బీజేపీలో చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News