Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్‌పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు

04-04-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని సోమందేపల్లిలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఉషశ్రీ చరణ్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ప్రవర్తన వల్ల టీటీడీ పవిత్రతకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రార్థించారు.

అలాగే, బి.ఆర్. నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సోమందేపల్లిలో టీటీడీ చైర్మన్‌పై వైఎస్ఆర్సిపి నిరసన, ప్రత్యేక పూజలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని సోమందేపల్లిలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి ఉషశ్రీ చరణ్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ప్రవర్తన వల్ల టీటీడీ పవిత్రతకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రార్థించారు.

అలాగే, బి.ఆర్. నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News