Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:37 AM

సంస్కృతి–సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

సంస్కృతి–సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

సంస్కృతి–సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి
11-01-2026 189 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట చరిత్రలోనే రికార్డు స్థాయిలో ముగ్గుల పోటీలు

500 మందికి పైగా మహిళల పాల్గొనడం విశేషం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగను ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా ఇన్‌చార్జి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు సమీపంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రస్తుతం అగ్రవర్ణాల పాలన కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో 97 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నప్పటికీ, కేవలం 3 శాతం అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. తీన్మార్ మల్లన్న సారథ్యంలో భవిష్యత్తులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలను బరిలోకి దింపి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కుల, మత భేదాలకు అతీతంగా మహిళలు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. సూర్యాపేట చరిత్రలోనే తొలిసారిగా 500 మందికి పైగా మహిళలు పాల్గొనడం విశేషమని, ఈ విషయం పట్టణవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు.

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీరు అక్బర్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి నాగరాజ్, లింగస్వామి, సైదులు, ఆవుల అంజయ్య, మంజుల గౌడ్, వర్రే కవిత, నారాయణదాసు కవిత, సేవ్య నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంస్కృతి–సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News