Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

08-02-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో ప్రచారం నిర్వహించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిపాలిటీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా చౌటుప్పల్ మున్సిపాలిటీ మారాలన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో లక్షలాది మందికి రేషన్ కార్డులు అందించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పదేండ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమందికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నదని తెలిపారు. అందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ళను ఎంతోమంది పేదలకు ఇచ్చిందన్నారు. మునుముందు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు మున్సిపాలిటీలో మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ నిర్బందాలు ఉండేవని, నేడు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి మున్సిపాలిటీ ప్రజలు ఓటు వేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మున్సిపాలిటీ ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. కౌన్సిలర్లు వేరే వాళ్లు ఉంటే పనిచేయరని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపాలిటీ ప్రజలకు తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News