Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:19 PM

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన

17-01-2026 233 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

సంక్రాంతి పండగ ముగించుకుని స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణమైన ప్రజలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండగ సెలవులు ముగియడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరగడంతో ఎన్‌హెచ్‌పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, కొండమల్లేపల్లి మీదుగా మళ్లించగా, నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను మునుగోడు, నారాయణపూర్ మార్గాల్లోకి మళ్లించారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలకు కోదాడ వయా హుజూర్‌నగర్, మిర్యాలగూడ, చింతపల్లి, మాల్ మార్గాలుగా దారి మళ్లింపు చేపట్టారు. అలాగే చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రోడ్డు వెడల్పు తగ్గి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చిట్యాల వద్ద వాహనాలను రామన్నపేట, వలిగొండ, భువనగిరి మార్గాలుగా మళ్లించారు.

ఈసారి సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో ఏపీకి వాహనాలు వెళ్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కోడి పందాలు వీక్షించేందుకు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఏపీకి తరలివెళ్లినట్లు సమాచారం. తిరుగు ప్రయాణంతో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీపై అప్రమత్తమైన పోలీసులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

Sthanikam

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News