Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:47 PM

సంగారెడ్డి జిల్లాలో వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

23-02-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భారత ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రోగ నియంత్రణ కేంద్రం మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సంయుక్తంగా సంగారెడ్డి జిల్లాను వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ పరిశీలన కోసం ఎంపిక చేసి సమగ్రంగా పరిశీలన నిర్వహించింది.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. వసంతరావు, వ్యాధి పరిశీలకులు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, రోగ నియంత్రణ కేంద్ర బృందం కలిసి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసి వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యాలు, అమలు విధానం, వివిధ శాఖల సమన్వయం పై చర్చించారు.తదుపరి కార్యక్రమంలో బృందం జిల్లా ప్రయోగశాలను సందర్శించి, ప్రస్తుత పరీక్షా సదుపాయాలు, వ్యాధుల గుర్తింపు సామర్థ్యం, రిపోర్ట్ ఇవ్వు విధానాలను పరిశీలించింది.అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, ప్రొఫెసర్లు కలిసి జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల గుర్తింపు, నివారణ చర్యలపై సమగ్రంగా చర్చించారు.తదనంతరం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ, అటవీ/వన్యప్రాణి శాఖ, వ్యవసాయ, పంచాయతీ రాజ్, మున్సిపల్, విపత్తు నిర్వహణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఆహార భద్రత శాఖ ప్రతినిధులు, పరిశోధనా కేంద్ర ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తరువాత మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని బృందం సందర్శించింది.ప్రస్తుతం వివిధ శాఖల్లో అమలులో ఉన్న పరీక్షా, రిపోర్ట్ విధానాలను అధ్యయనం చేయడం, ఆసుపత్రులు మరియు ప్రయోగశాలల సామర్థ్యాన్ని అంచనా వేయడం, వన్ హెల్త్ ప్రాజెక్ట్ సమర్థవంతంగా అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సమన్వయ విధానాలను పరిశీలించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటుచేయబడింది.జిల్లాలో వన్ హెల్త్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను ముందస్తు గుర్తింపు చేసి నియంత్రించడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.కార్యక్రమంలో డా. ఎం. వసంతరావు, డా. అతుల్ ఆనంద్, డా. సంజీవ్ సైని, డా. వెట్రివేల్, డా. సయన్ రాయ్, డా. కార్డిలియా, ప్రోగ్రాం అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లాలో వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News