Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:24 AM

సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలీసెట్-2026 పరీక్ష

13-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లమా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2026 ప్రవేశ పరీక్ష సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. జానకీ దేవి తెలిపారు. బుధవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు సంగారెడ్డి పట్టణం మరియు జోగిపేట్‌లో ఏర్పాటు చేసిన మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో 2,068 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 1,897 మంది పరీక్ష రాశారని, 171 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని తెలిపారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలీసెట్-2026 పరీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News