Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:18 AM

సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన జొన్నల కొనుగోలు కేంద్రాలు

22-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

రైతులు మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి:

నాయకులు, అధికారులు

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్యస్వామి తెలిపారు. ఇదే

హద్నూర్ లొ ప్రారంభించిన దృశ్యం

సమయంలో హద్నూర్ పాక్స్‌లో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాల్ జొన్నలకు రూ.3,699 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. రైతులు మధ్యదళారులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు జొన్నలను తీసుకురావాలని సూచించారు. కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా జమ అవుతాయని వివరించారు.రైతులు జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో పట్టాదారు పాసుబుక్, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, డీసీసీ బ్యాంక్ మేనేజర్ ధనుంజయ్, ఆర్‌ఐ శ్యాంరావు, సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి, జగన్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీఐ జక్కుల హనుమంతు, ఎస్సై సుజిత్, బస్వరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన జొన్నల కొనుగోలు కేంద్రాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News