Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

సిర్గాపూర్ బాలికల గురుకుల పాఠశాలల్లో జాతీయ దినోత్సవంలో:ఖేఢ్ ఎమ్మెల్యే

సిర్గాపూర్ బాలికల గురుకుల పాఠశాలల్లో జాతీయ దినోత్సవంలో:ఖేఢ్ ఎమ్మెల్యే

సిర్గాపూర్ బాలికల గురుకుల పాఠశాలల్లో జాతీయ దినోత్సవంలో:ఖేఢ్ ఎమ్మెల్యే
January 24, 2026 04:36 PM 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం,మహిళా, శిశు,వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా మరియు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ

అధికారి కేతావత్ లలిత కుమారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా బాలికలందరికీ జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ, బాలికల విద్య,ఆరోగ్యం మరియు సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు చేపడుతున్నదని తెలిపారు.గురుకుల పాఠశాలల ద్వారా బాలికలకు ఉచిత విద్యతో పాటు నాణ్యమైన భోజనం,సురక్షిత నివాసం అందించి వారి కలలను సాకారం చేస్తున్నాయని చెప్పారు.ఈ పథకాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి బాలిక చదువులో ముందుకు వెళ్లి, భవిష్యత్తులో దేశానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే విద్యార్థులు అవసరం లేని దృష్టి మరల్చే అంశాలను తగ్గించుకొని,పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్య ద్వారా మాత్రమే జీవితం వెలుగొందుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా బాలికల తల్లితండ్రులు కూడా ఆడపిల్లలను డిగ్రీ వరకు కాకుండా ఉన్నత విద్యకు ప్రోత్సహించాలని, చదువు పూర్తయ్యాక ఉద్యోగం సాధించిన తరువాతే వివాహం చేయడం ద్వారా వారికి మరింత మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు.ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ సర్పంచ్ నరసింహ రావు పాటిల్, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధి యాదగిరి, మండల విద్యాధికారి నగరం శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ జాతీయ బాలిక దినోత్సవ వేడుక బాలికలలో ఆత్మవిశ్వాసం, ఆశయాలను పెంపొందించేలా నిలిచింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News