Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:46 AM

శ్రీ వేదాంత భజన మందిరంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస వేడుకలు

10-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్‌లో ఉన్న శ్రీ వేదాంత భజన మందిరంలో ధనుర్మాస వేడుకలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పాశుపరాలు పట్టించి ధనుర్మాస ప్రత్యేక భజనలు నిర్వహించారు.

మందిర ప్రధానార్చకులు ధరూరి సింగరాచార్యులు, ధరూరి రాఘవాచార్యులు ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ధనుర్మాస వేడుకల్లో భాగంగా స్వామివారికి వెన్న నివేదన కార్యక్రమం భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మందిరానికి విచ్చేసిన భక్తులందరికీ ఉచితంగా వెన్న ప్రసాదాన్ని అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భజనలు, పూజా కార్యక్రమాలతో మందిరం భక్తిశోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి భక్తులు, గోదాదేవి, ప్రేమలత, హైమావతి, స్వాతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ధనుర్మాస వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

శ్రీ వేదాంత భజన మందిరంలో అంగరంగ వైభవంగా ధనుర్మాస వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News