Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం
23-01-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్వామి ఊరేగింపును ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేషo

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం స్వామివారి నగరోత్సవం భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి వేదోక్త పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా స్వామివారి నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి హారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.

ఈ నగరోత్సవ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆలయ ఈవో, నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కెట్‌పల్లి మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తుల జయజయధ్వానాల నడుమ జరిగిన ఈ నగరోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Sthanikam

శోభయామానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News