రామన్నపేట మండలంలోని శోభానాద్రిపురం గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వేముల వీరేశం తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి