Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు

శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు

శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు
26-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

అంగరంగ వైభవంగా రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం సోమవారం తెల్లవారుజామున అర్చక బృందం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, స్వామి వారి కల్యాణ ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.

ఈ పవిత్ర కార్యక్రమానికి గౌరవ నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం దంపతులతో కలిసి హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చెర్వుగట్టు గుట్ట జనసంద్రంగా మారి, భక్తుల జయజయధ్వానాలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

ఈ కల్యాణ వేడుక చెర్వుగట్టు క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసిందని భక్తులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News