Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:31 PM

శిక్షణతో స్వయం ఉపాధి – మహిళలకు బలమైన అడుగు

24-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మహిళా సాధికారత కేంద్రం మరియు “బేటి బచావో – బేటి పడావో” కార్యక్రమం పరిధిలో నారాయణఖేడ్ డివిజన్‌లో కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నారాయణఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడిన ఉమా హారతి మహిళల సాధికారతకు ఉపాధి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడగలరని తెలిపారు.ఈ శిక్షణ కేంద్రం మహిళలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, చిన్న స్థాయి వ్యాపారాలను ప్రారంభించేందుకు మంచి వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. జిల్లా సంక్షేమ అధికారిణి కె. లలిత కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సాధికారత కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆడపిల్లల సంరక్షణ, అభివృద్ధి ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎన్. సుజాత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, బాలసదనం సూపరింటెండెంట్ విజయ, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, శిక్షణ కేంద్రం సిబ్బంది మరియు స్థానిక మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

శిక్షణతో స్వయం ఉపాధి – మహిళలకు బలమైన అడుగు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News