Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ మల మూత్ర ద్వారాలు ఏర్పాటుతో దూడకు జీవం పోసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య

04-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ మల మూత్ర ద్వారాలు ఏర్పాటుతో దూడకు జీవం పోసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య

ఆత్మకూరు ఎస్ మండలం నసీం పేట గ్రామానికి చెందిన గుండపునేని రవీందర్ రావు ఇంట్లో గేదె నిన్న దూడను పెట్టగా విచిత్రంగా పుట్టిన

దూడ కి మల , మూత్ర ద్వారాలు మరియు జననావయాలు లేకుండా పుట్టింది. అది ఆడ దూడో మగ దూడో కూడా తెలియకుండా రైతు ఆందోళనకు గురయ్యాడు. వైద్యం కోసం సూర్యాపేట ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ ని సంప్రదించగా , దూడను పరిశీలించి అత్యవసర శస్త్ర చికిత్సకై దూడను కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలకు పంపించారు.దూడ పొట్ట తెరిచిన తరువాత మల ద్వారం చివరివరకు ఏర్పాటు కాకుండా మధ్యలోనే ఉండిపోవడం తో దానిని అంతవరకు కత్తిరించి , అట్టి పేగుని పొట్ట లోపలి నుండి వెనుకకి లాగి మలద్వారం ఉండాల్సిన ప్రాంతం లో కృత్రిమ ద్వారం ఏర్పాటు చేసి కత్తిరించిన పేగుని కృత్రిమ మలద్వారం ద్వారా బైటకు అతికించి కుట్లు వేసి శాశ్వత మలద్వారం ఏర్పాటు చేయడం జరిగింది.

మూత్రాశయం నుండి మూత్ర నాళం తయారు కాక మూత్రం ముత్యరాశంలోనే నిండి ఉండగా చిన్న రంధ్రం ద్వారా మూత్రాన్ని తొలగించి మూత్రాశయం లోనికి మనుష్యులలో వాడే మూత్ర నాళికా గొట్టాన్ని అమర్చి తిరిగి పొట్టకు కుట్లు వేసి అతికించి మూత్రం సాఫీగా నడవడానికి కృత్రిమ ద్వారం ఏర్పాటు తో దూడ పొట్ట నొప్పి తగ్గి ఉపశమనం పొందేలా విజయవంతంగా శస్త్ర చికిత్స ముగించారు .

శస్త్రచికిత్స లో చిలుకూరు మండల పశువైద్యాధికారి డా. కొండా వీరారెడ్డి, కాపుగల్లు పశువైద్యాధికారి డా. సిరిపురపు సురేంద్ర, సిబ్బంది రాజు, చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News