Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

శ్రీరామనవమి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తి పూర్వక పర్యటన

27-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో ఆలయాల సందర్శన – ప్రజల శ్రేయస్సుకోసం ప్రత్యేక ప్రార్థనలు

నకిరేకల్ నియోజకవర్గంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తిశ్రద్ధలతో పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొదటగా చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం పట్టణంలోని శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

తదుపరి నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.

పర్వదినం సందర్భంగా ప్రజలతో కలిసి భక్తి భావనలో పాల్గొనడం ఆనందంగా ఉందని, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Sthanikam

శ్రీరామనవమి సందర్బంగా ఎమ్మెల్యే వేముల వీరేశం భక్తి పూర్వక పర్యటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News