Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:36 PM

శ్రీరామ నవమి వేళ నల్లపోచమ్మ ఆలయంలో ఘన పూజలు

27-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు సిద్దు స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అనంతరం పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు ఘనంగా జరిపారు. పూజల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సిద్దు స్వామి మాట్లాడుతూ, మంజీర నది ఒడ్డున ఉన్న ఈ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందినదని, మారుమూల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. అమ్మవారికి చేసిన ప్రార్థనలు నెరవేరుతాయని భక్తుల్లో గాఢ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఆలయానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి.

Sthanikam

శ్రీరామ నవమి వేళ నల్లపోచమ్మ ఆలయంలో ఘన పూజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News