Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:31 AM

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం చివ్వెంల – ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్య మంత్రస్వరూప్ దాస్ జీ స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి భావనలతో ముందుకు సాగుతూ ప్రతి భారతీయుడు దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విలువలను కాపాడుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News