Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

శ్రీ రాముని జయంతిని స్మరిస్తూ ముక్టపూర్ గ్రామంలో ఘన నగర సంకీర్తన

Updated : 22 Jan 2026 20:48 IST
As Preferred Source 1 min read
శ్రీ రాముని జయంతిని స్మరిస్తూ ముక్టపూర్ గ్రామంలో ఘన నగర సంకీర్తన

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన పవిత్ర దినాన్ని స్మరిస్తూ,గురువారం నాగల్ గిద్ద మండలం ముక్టపూర్ గ్రామం లో జనవరి 22న శ్రీ రామ నగర సంకీర్తన ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో ప్రముఖ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భక్తులతో కలసి రామనామ స్మరణలో పాల్గొన్నారు.గురువారం సాయంత్రం 8.00 గంటల నుండి ముక్టపూర్ గ్రామంలోని దేవాలయాల నుండి, అలాగే గ్రామంలోని భక్తులు హనుమాన్ దేవాలయాలు మరియు ఇతర ఆలయాల కార్యవర్గాల ఆధ్వర్యంలో నగర సంకీర్తన ప్రారంభమైంది. ప్రతి ఆలయం నుంచి బయలుదేరిన భక్తులు రామ భజనలు ఆలపిస్తూ, కోలాటతో ఊరేగింపు ఘనంగా సాగింది. కార్యక్రమం చివర గ్రామం చావుడి ప్రధాన రోడ్ వద్దకు చేరి, శ్రీ రాముని జెండా సమర్పణతో రామజపం ప్రార్థన ముగించబడింది.పట్లోల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “శ్రీ రాముని ఆదర్శాలు ప్రతి ఒక్కరి జీవితంలో నిలవాలి. ఇలాంటి నగర సంకీర్తనలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి” అని పేర్కొన్నారు. భక్తులు స్వీట్ పంపిణీ, భజనల ఆలాపన వంటి సేవల్లో స్వచ్ఛందంగా పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. పని దినమైనప్పటికీ పెద్ద సంఖ్యలో యువకులు, ప్రజలు హాజరైనందున ఆ రోజు గ్రామ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మురిసిపోయాయి. యువత, రామ భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం విశేషం.

Sthanikam

శ్రీ రాముని జయంతిని స్మరిస్తూ ముక్టపూర్ గ్రామంలో ఘన నగర సంకీర్తన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news