Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:39 AM

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి...

27-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కళ్యాణం... కమనీయం.... రమణీయం...

గోపిరెడ్డి నగర్ లో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం....

శ్రీ సీతారాముల కళ్యాణం దర్శన భాగ్యం కల్పించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనీయులు... మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు...

శ్రీ సీతారాముల ఆశీస్సులతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవంలో వారి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో శాంతి సామరస్యాలు పెంపొందుతాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి ధన్యులం అయ్యాం అన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ దర్శన భాగ్యం కల్పించిన గోపి రెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. పట్టణ ప్రజలకు శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, 6వ కౌన్సిలర్ నాగేంద్రమ్మ 14వ వార్డు కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు 19 వ వార్డు కౌన్సిలర్ కొల్ల కోటి రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ గుండపు నేని పద్మ,గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

Sthanikam

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News