భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి
స్థానికం: యదాద్రి భువనగిరి జిల్లా బుర్యో జి.శ్రీనివాస్
భువనగిరి పట్టణ పరిధిలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయ రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన గురువారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజల కట్ట సోమేశ్వరాలయం ప్రధాన అర్చకులు కప్పగంతుల నాగరాజు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...భువనగిరి పట్టణంలో ఎంతో పురాతన ప్రసిద్ధి చెందిన ప్రజల కట్ట సోమేశ్వర ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వేలాదిమంది భక్తులు దర్శించుకునే ఆలయానికి రోడ్డు సరిగా లేకపోవడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు తెలపడంతో హెచ్.ఎం.డి.ఏ నిధులు కేటాయించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. ఆలయాల అభివృద్ధికి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జి.రామలింగం,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండి.అవేస్ చిస్తి,కాంగ్రెస్ పార్టీ నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్,బర్రె జహంగీర్,పోతంశెట్టి వెంకటేశ్వర్లు,తంగళ్ళపల్లి రవి కుమార్,కుక్కదువ్వు సోమయ్య, కూర వెంకటేష్,మంగ ప్రవీణ్,దర్గాయి హరి ప్రసాద్,దేవరకొండ నరసింహ చారి,గుర్రాల శ్రీనివాస్ జంగిటి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి