పిల్లలమర్రి
ఈరోజు శని త్రయోదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన పిల్లలమర్రి శివాలయంలోని నవగ్రహ మండపంలో వేంచేసియున్న సతీ సమేత శని భగవానునికి తెల్లవారుజామున భక్తుల సాహస్తాలతో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శని భగవానునికి తైలాభిషేకం, పుష్పార్చన, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి దివ్య దర్శనం కల్పించారు.శని త్రయోదశి సందర్భంగా నిర్వహించిన ఈ పూజలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. శని భగవానుని దర్శించుకోవడం వల్ల కష్టాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి