Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

శనగలగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

24-02-2026 298 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ఉన్న శనగల గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడనుంది. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గుణ శుద్ధ అష్టమి సందర్భంగా నిర్వహించబడుతున్న ఈ మహోత్సవంలో భాగంగా మంగళవారం (24-02-2026) ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యవాచనం, అఖండ దీపారాధన, గణపతి హోమం కార్యక్రమాలు జరుగనున్నాయి.

బుధవారం (25-02-2026) ఉదయం 8 గంటలకు గరుడముద్ద, 10 గంటలకు ఎదురుకోలు కార్యక్రమం నిర్వహించబడనుంది.ఉదయం 11:15 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగనుండగా, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 5:30 గంటలకు పలహారపు బండ్ల ప్రదర్శన, రాత్రి 9 గంటల నుండి యక్షగాన కళాకారులచే వీధి భాగవత ప్రదర్శన భక్తులను అలరించనుంది.

గురువారం (26-02-2026) ఉదయం 4 గంటలకు కుంభహోమం, రథోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

ఈ మహోత్సవానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు కళ్యాణ కర్తలుగా వ్యవహరిస్తుండగా, దేవాలయ కమిటీ చైర్మన్ చింతల సుగుణమ్మ దేవరాజ్ దంపతులు, అన్నప్రసాద పోషకులు చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ నవనీత–దేవేందర్ దంపతులు సహకారం అందిస్తున్నారు.ముఖ్య అతిథులుగా రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న, ఎం.సి. కోటి రెడ్డి హాజరుకానున్నారు.స్వామివారి కళ్యాణం రోజు పంతంగి గ్రామం నుండి శనగల గుట్ట వరకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించనున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. మహోత్సవానికి సహకరించిన దాతల పేర్లు దేవాలయ ఆవరణంలో ఫ్లెక్సీలపై ప్రదర్శించబడనున్నాయి.అలాగే ప్రతి నెల మాస కళ్యాణం, ప్రతి శనివారం శనిశిల పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నట్లు దేవస్థానం నిర్వాహకులు వెల్లడించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం కమిటీ కోరింది.

Sthanikam

శనగలగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News