Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

17-12-2025 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

స్థానికం ప్రతినిధి

హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.

విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్ మను చౌదరి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో రాష్ట్రపతిని ఆత్మీయంగా సత్కరించారు.

ప్రత్యేక విమానం నుంచి దిగిన వెంటనే అధికారిక గౌరవాలతో స్వాగతం అందుకున్న రాష్ట్రపతి, అనంతరం ప్రత్యేక వాహనంలో రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ముందుగా విమానాశ్రయానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రాకతో హకీంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో కళకళలాడాయి.

Sthanikam

శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News