Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:28 AM

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు

31-12-2025 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు సంయమనం పాటించాలని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. వేడుకలు ఆనందంగా సాగాలి గానీ, అవి ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 రాత్రి నుంచి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని, మండల వ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తేనే నిజమైన ఆనందం దక్కుతుందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని సీఐ స్పష్టం చేశారు.

Sthanikam

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు – సీఐ వెంకటేశ్వర్లు

Article Image

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట: నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేళ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు సంయమనం పాటించాలని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. వేడుకలు ఆనందంగా సాగాలి గానీ, అవి ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 రాత్రి నుంచి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని, మండల వ్యాప్తంగా నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తేనే నిజమైన ఆనందం దక్కుతుందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని సీఐ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News