Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు

20-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ప్రజా ప్రభుత్వం పథకాల అమలులో సేవాదళ్ కీలక పాత్ర

భువనగిరి టౌన్ :రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు మాట్లాడుతూ,జితేందర్ నాయకత్వంలో సేవాదళ్ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతమై ఎన్నికల్లో విశేష ఫలితాలు సాధించిందన్నారు.2023లో సేవాదళ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వాలంటీర్లను నియమించి ఎమ్మెల్యేల గెలుపుకోసం కృషి చేశారని తెలిపారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌చార్జీలను నియమించి ఎంపీల విజయానికి సేవాదళ్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శ్రమించారని,ఫలితంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్నబియ్యం పంపిణీ, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళ్తోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని అందించడంలో నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్,జనరల్ సెక్రటరీ షేక్ వాజిద్,బ్లాక్ సేవాదళ్ అధ్యక్షులు లోక్ దాస్ ఉప్పలయ్య,యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ పుట్ట శివకుమార్,బత్తిని జితేందర్,ప్రకాష్, శ్రీనివాస్,జల్తా రాజు,రాజు గౌడ్,సురేందర్,రాజశేఖర్,అంకం రాజేష్,మహిళా జిల్లా నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News