Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:26 AM

సేవా కార్యక్రమాలతో సదాశివపేటలో సామ్ ట్రస్ట్ ప్రత్యేక గుర్తింపు: ఎమ్మెల్యే

09-05-2026 241 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సామ్ ట్రస్ట్ చారిటీ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సామ్ ట్రస్ట్ చైర్మన్ షేక్ అంజుమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెహందీ డిజైన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ సామ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. విద్య, మహిళా సాధికారత మరియు సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి ట్రస్ట్ చేస్తున్న కృషి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు అక్బర్ హుస్సేన్, కౌన్సిలర్లు సోమశేఖర్, ఫణి కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, టీఆర్ఎస్ నాయకులు నాగుల విజయకుమార్, లతేఫ్, నసీరుద్దీన్, శ్రీహరి, హాజీ, చింత సాయినాథ్, మోబిన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సేవా కార్యక్రమాలతో సదాశివపేటలో సామ్ ట్రస్ట్ ప్రత్యేక గుర్తింపు: ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News