Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

సీతారాముల కల్యాణానికి శుభారంభం

సీతారాముల కల్యాణానికి శుభారంభం

సీతారాముల కల్యాణానికి శుభారంభం
26-03-2026 235 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కలశస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ వంటి పూజా కార్యక్రమాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ లు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు జరిపారు.ఉత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. దేవాలయ కమిటీ అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి, సంధ్య దంపతులు, పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు, గుర్రం వెంకటేశం, వెన్నెల రవి గౌడ్ దంపతులు, తూర్పాటి నరసింహ, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, అనిత దంపతులు, బొంగు జంగయ్య గౌడ్, కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు గౌడ్, సుర్వి నర్సింహా గౌడ్, చిక్క నరసింహ, ముత్యాల భూపాల్ రెడ్డి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, కాసుల వెంకటేష్ గౌడ్, కంచరకుంట్ల వెంకటరెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బొడిగె బాలకృష్ణ గౌడ్, బొబ్బిళ్ళ శ్రీరాములు, ఉడుగు మల్లేష్ గౌడ్, డాకోజి లక్ష్మీనారాయణ, గుజ్జుల రవీందర్ రెడ్డి, భువనగిరి శ్రీనివాస్, వరగంటి బోవయ్య గౌడ్, మహిళా భక్తులు కొసనం అనురాధ, రాజపేట శ్రీలత, అనూష, మామిడి వెంకటమ్మ, దాడి పద్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ తెలిపింది. సుమారు పదివేల మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ,

“భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని విజయవంతం చేయాలి” అని కోరారు. చౌటుప్పల్ పురపాలక, మండల ప్రజలు ఈ మహోత్సవాన్ని కన్నుల విందుగా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

సీతారాముల కల్యాణానికి శుభారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News