Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:34 AM

సీతారాముల కల్యాణ తలంబ్రాలుఇంటికే

సీతారాముల కల్యాణ తలంబ్రాలుఇంటికే

సీతారాముల  కల్యాణ తలంబ్రాలుఇంటికే
21-02-2026 283 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం

ఈ ఫిబ్రవరి 23 నుంచి బుకింగ్స్ ప్రారంభం"శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది.

శ్రీ రామనవమి' సందర్భంగా మార్చి 27, 2026న జరిగే వేడుకలను దృష్టిలో ఉంచుకుని, వివిధ కారణాల వల్ల భద్రాచలం కు వెళ్లలేని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.

ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లు' పొందాలనుకునే భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్ సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

అలాగే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.

హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి, ఆవిష్కరించారు.

నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు.

విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని మూడేళ్ళ క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత మూడేళ్ళలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందని టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి, ఐపీఎస్ అన్నారు.

భద్రాద్రిలో మార్చి 27న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు.

రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని నాగిరెడ్డి తెలిపారు.

తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440069లలో సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ సీటీఎం(మార్కెటింగ్ & కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటిఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీతారాముల కల్యాణ తలంబ్రాలుఇంటికే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News