Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

03-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం పరిధిలో జంమ్గి (కే) హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్ పక్కన ఉన్న ఒక ఇంటి లో నిన్న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిందితురాలు వాడిత్య సౌందర్య (21 సంవత్సరాలు), ఎం.సి నాయక్ కుమార్తె, కంగ్టి మండలం జామగట్టి బి తండాకు చెందినదిగా గుర్తించారు. వివాహం అయినప్పటికీ భర్తతో వేరుగా ఉంటూ జులాయి జీవితం గడుపుతూ తిరుగుతుందని, గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత గోవాకు వెళ్లాలనే ఆలోచనతో డబ్బుల కోసం మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, 01-04-2026 న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో యంపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న యాసం సంతోష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారం మరియు నగదును దొంగిలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఈ రోజు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి సుమారు 8 తులాలు 5 గ్రాముల బంగారం, రూ.1,10,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించగా, ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Sthanikam

సీసీ కెమెరాలే సాక్ష్యం – దొంగతనం కేసును వేగంగా ఛేదించిన కంగ్టి పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News