Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:25 PM

సీపీఐ నేత బడుగు వెంకటయ్యకు ఘన నివాళులు

సీపీఐ నేత బడుగు వెంకటయ్యకు ఘన నివాళులు

సీపీఐ నేత బడుగు వెంకటయ్యకు ఘన నివాళులు
02-06-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, న్యూస్‌టుడే: సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, విప్లవ యోధుడు బడుగు వెంకటయ్య 20వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం రామన్నపేట పట్టణ కేంద్రంలో ఆయన స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ పార్టీ జెండాను ఆవిష్కరించి, వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఎర్రజెండా పార్టీని బలోపేతం చేస్తూ శాఖల ఏర్పాటు కోసం బడుగు వెంకటయ్య విశేష కృషి చేశారని అన్నారు. పేదలు, కార్మికులు, రైతుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. అప్పటి రామన్నపేట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కామ్రేడ్ గుర్రం యాదగిరిరెడ్డితో కలిసి పనిచేసి విశేష సేవలందించారని పేర్కొన్నారు.

గంగాపురం యాదయ్య మాట్లాడుతూ వెంకటయ్య మరణించి రెండు దశాబ్దాలు గడిచినా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీపీఐ నాయకులు బాలగోని మల్లయ్య, ఊట్కూరు భగవంత్, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, జగన్నాథంపంతులు, సంగిశెట్టి పాండు, వీసం గాలయ్య, ఏనూతుల రమేష్, కళ్లెం యాదగిరి, ఊట్కూరి కృష్ణ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు సమ్మయ్య, జెల్ల అశోక్, గోషిక నవీన్‌కుమార్, మల్లేశం, సుదర్శన్, ఎర్ర మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీపీఐ నేత బడుగు వెంకటయ్యకు ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News