Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:29 PM

సెలవుల వేళ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

24-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్సై దోమ సుజిత్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ… ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండగా, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి, పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇంటి వద్దనే ఉంటారని తెలిపారు.ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మొబైల్ ఫోన్ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు స్పందించవద్దని, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరించారు. సైబర్ నేరస్తుల నుంచి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే సెలవుల కారణంగా పిల్లలకు ద్విచక్ర వాహనాలు లేదా కార్లు ఇవ్వకూడదని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇది కుటుంబాలకు తీవ్ర బాధ కలిగిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని కోరారు.పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయడం అత్యంత అవసరమని, వారి భవిష్యత్తు దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కావున పోలీసుల సూచనలు పాటిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని హద్నూర్ పోలీసులు తెలియజేశారు.

Sthanikam

సెలవుల వేళ పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News