Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:22 AM

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

02-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్ పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్సై దోమ సుజిత్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. ప్రస్తుతం సెలవుల కాలం ప్రారంభమవడంతో చాలా మంది కుటుంబాలతో కలిసి విహారయాత్రలు, శుభకార్యాలు తదితర కారణాలతో ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లడం జరుగుతుందని, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగలు బంగారం, నగదు పై ఆశపడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారని హెచ్చరించారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం లేకుండా ఇంట్లో అధిక మొత్తంలో బంగారం, నగదు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఇంటిని తాళం వేసి వెళ్లే ముందు పొరుగువారికి లేదా నమ్మకమైన వారికి సమాచారం ఇవ్వడం మంచిదని సూచించారు. “మన ఇంట్లోకి ఎవరూ రారు” అనే నిర్లక్ష్య భావన వద్దని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రజల సహకారం లేకుండా నేర నియంత్రణ సాధ్యం కాదని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, అందరూ అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

Sthanikam

సెలవుల సమయంలో అప్రమత్తంగా ఉండండి – ఎస్సై దోమ సుజిత్ సూచనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News