Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:47 PM

సీఐ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం

26-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. అఖిల్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్,న్యాల్కల్ మండల అధ్యక్షులు బి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సంస్థ కమిటీ సభ్యులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలు,అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం అందేలా ఇలాంటి సంస్థలు ముందుండి పనిచేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.అలాగే సంస్థ ద్వారా ప్రజాసేవ కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టి, మానవ హక్కుల పరిరక్షణలో నారాయణఖేడ్ ప్రాంతాన్ని ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.

Sthanikam

సీఐ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News