Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:01 AM

సీఎం సహాయ నిధితో పేదలకు ఖరీదైన వైద్యం

సీఎం సహాయ నిధితో పేదలకు ఖరీదైన వైద్యం

సీఎం సహాయ నిధితో పేదలకు ఖరీదైన వైద్యం
25-03-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందుతోందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నివాసంలో 24 మంది లబ్ధిదారులకు రూ.9,26,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 నెలల్లో తమ ద్వారా 98 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.40,25,500 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు వెయ్యి కోట్లకు పైగా నిధులు కేటాయించడం విశేషమన్నారు.పేదలకు ఈ సహాయ నిధి ఒక వరంలా మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సహాయం అందిస్తామని తెలిపారు. తమకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పేదల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.

Sthanikam

సీఎం సహాయ నిధితో పేదలకు ఖరీదైన వైద్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News