లబ్ధిదారులకు ఆర్థిక భరోసా – ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ఈరోజు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యాలు, ప్రమాదాలు వంటి అనివార్య పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకుసీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ,
లబ్ధిదారులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి