Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం
10-03-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా చౌటుప్పల్ అంబేద్కర్ ట్రస్ట్ చైర్మన్ బోయ రామచందర్ హాజరై మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారని అన్నారు. సమాజంలోని అనగారిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహజన్, మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు చీమకండ్ల శ్రీనివాస్, మండల నాయకులు బర్రె సుధాకర్, చేకూరి బాబు, ఎమ్మార్పీఎస్ పంతంగి గ్రామ శాఖ అధ్యక్షుడు బోయ శ్రావణ్ కుమార్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సావిత్రిబాయి పూలే ఆశయాలు యువతకు ఆదర్శం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News