Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

23-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో ఈరోజు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, నేతాజీ దేశం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు ఎప్పటికీ మరచిపోలేనివని అన్నారు. వారి జీవితం ప్రతి భారతీయునికి స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా యువత నేతాజీ ఆశయాలు, ఆదర్శాలను అనుసరించి దేశ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగభావం వంటి విలువలు సమాజంలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాచేపల్లి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్, తదితర ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులర్పించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News