Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:57 PM

స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకుంటున్న ఫరిదా బేగం

06-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్

13వ వార్డు సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రజల ముందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి ఫరిదా బేగం జావీద్‌కు రోజురోజుకీ ప్రజాధారణ పెరుగుతోంది. అధికార ఆశతో కాదు, అభివృద్ధి సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచిన ఆమె ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.వార్డులో నెలకొన్న మౌలిక వసతుల లోపాలు, పారిశుధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి, పేదల సమస్యల పరిష్కారమే తన ప్రధాన అజెండాగా ప్రజలకు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి, శుభ్రమైన వీధులు, సురక్షిత తాగునీరు, మెరుగైన అంతర్గత రోడ్లు, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఫరిదా బేగం జావీద్ మాట్లాడుతూ…“నాకు అధికారం కాదు – అభివృద్ధి కావాలి. ప్రజల సేవే నా లక్ష్యం. ఒక్కసారి అవకాశం ఇస్తే 13వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాను” అని భరోసా ఇచ్చారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి సమస్యలకు వెంటనే స్పందిస్తున్న తీరుకు మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు.వార్డులో కొనసాగుతున్న ప్రచారం రోజురోజుకీ మరింత ఉత్సాహంగా సాగుతూ, ప్రజల చురుకైన భాగస్వామ్యంతో విశేష స్పందనను పొందుతోంది. 13వ వార్డు భవిష్యత్తు కోసం ఫరిదా బేగం జావీద్‌పై ప్రజల్లో ఆశాభావం రోజురోజుకీ పెరుగుతోంది.

Sthanikam

స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల మనసు గెలుచుకుంటున్న ఫరిదా బేగం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News