Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...

స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...

స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...
22-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి నిత్య కళ్యాణ మహోత్సవం.

ఘనంగా తిరువీధి ఉత్సవ సేవ.

శోభాయమనంగా జల నారాయణుడికి నక్షత్ర హారతులు.

భువనగిరి టౌన్:తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్థానంలో శనివారం రోజు ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనీ మాయ శోభిత స్వర్ణ భరణములతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ అష్ట లక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలు అనగా పసుపు సుగంధ ద్రవ్యాలతో వసంతోత్సవ సేవను నయనానందకరంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ అర్చక స్వాములు కర్పూర మంగళ హారతులను సమర్పించారు. ఉదయం 10:30కు శ్రీవారికి పట్టుపితంరాలు ధరింపజేసి సుగంధ భరిత పుష్పమాలతో అలంకరించి నిత్య కళ్యాణం మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యుల దివ్య కరములచే అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. స్వామివారి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు నేటి సాయంత్రం ఆలయ తిరుమల వీధులలో స్వర్ణగిరీష్యుని ఊరేగించగా స్వర్ణగిరి మాడవీధులు గోవింద నామాలతో మారు మోగాయి. శనివారం సందర్భంగా ఆలయానికే ఆకర్షణీయంగా నిలిచిన జల నారాయణస్వామి వారికి నక్షత్ర మంగళహారతులను ఆలయ అర్చక స్వాములు సమర్పించారు. ఈరోజు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు , చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణలు తెలిపారు.

Sthanikam

స్వర్ణగిరిషుడికి ఘనంగా వసంతోత్సవ సేవ...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News