Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు... ‌‌

11-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హాజరైన ఆళ్వార్ తిరునగరి ఎంబెరుమానర్ రంగ రామానుజ జీయర్ స్వామి.

స్వర్ణగిరిలో ఘనంగా లక్ష్మీనారాయణ ఇష్టిహవనం.

బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వర్ణగిరిశుడు.

తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో రెండవ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రాన్ని దగదగా మెరిసే విద్యుదీపాలతో అలంకరించారు. నేటి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం రోజు అన్యోన్య దాంపత్యం కొరకు లక్ష్మీనారాయణ ఇష్టిహవనంను నిర్వహించారు. నేడు దేవాలయానికి అళ్వార్ తిరునగిరి ఎంబెరుమానర్ జీయర్ మఠం రంగా రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వర్ణగిరి క్షేత్రంలో ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడుని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికిపైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Sthanikam

స్వర్ణగిరిలో ఘనంగా బ్రహ్మోత్సవాల వేడుకలు... ‌‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News