Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...

19-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మహత్తర ఘట్టాన్ని చూసి తరించిన భక్తజనులు.

యాదాద్రి భువనగిరి జిల్లా: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రోజు అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. ఫిబ్రవరి 19న ఉదయం సరిగ్గా 7 గంటలకు సూర్య భగవానుడి కిరణాలు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి పాద పద్మాలను స్పర్శించాయి. గతంలో భీష్మ ఏకాదశి నాడు జరిగిన ఈ అపురూప ఘట్టం,నేడు మళ్ళీ పునరావృతమైంది.ఇది ఆలయ నిర్మాణ కౌశలానికి, ఆధ్యాత్మిక రహస్యానికి నిదర్శనమని భక్తులు కొనియాడారు. సూర్య కిరణాల వెలుగులో స్వామి వారి దివ్య మంగళ స్వరూపం దేదీప్యమానంగా వెలిగి పోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించిన భక్తులు భక్తిపరవశంలో మునిగి పోయారు. ఈ 'సూర్య కిరణార్చన'మరో రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 20,21 తేదీల్లో) కూడా ఉదయం 7 గంటలకు పునరావృతం అవుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు,ఆలయ చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ,గోపికృష్ణలు,ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణా చార్యులు తెలిపారు.

Sthanikam

స్వర్ణగీరీశున్నీ పాదాలను తాకిన భానుడి కిరణాలు...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News