Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:16 AM

స్వామివారి కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు – ప్రాంగణం పరిశీలించిన చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

09-03-2026 388 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని బాలాజీ రామకృష్ణ దేవాలయం కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న జరిగే ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వామివారి కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు – ప్రాంగణం పరిశీలించిన చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

చౌటుప్పల్ మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని బాలాజీ రామకృష్ణ దేవాలయం కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న జరిగే ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News