Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

Updated : 29 Mar 2026 16:03 IST
As Preferred Source 1 min read
స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలోని అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతుంది.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్లా వరహాల రెడ్డి మాట్లాడుతూ.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏప్రియల్ రెండవ తారీకు గురువారం రాత్రి 10 గంటలకు వేద పండితుల మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29 నుండి వచ్చేనెల నాలుగో తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, కబడ్డీ క్రికెట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కోదాడ మండల వ్యాప్తంగా ఉన్న భక్తులు, గ్రామ భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్యలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Sthanikam

స్వామివారి కల్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news